గురుదేవతా భజనమంజరీ

పాహి శ్రీ నృసింహ పాలిసో

ఘోషః

లక్ష్మీనరసింహ భగవాన కీ జై | ప్రహ్లాదవరదనిగె జై

శ్లోకః

శ్రీమత్పయోనిధినికేతన
చక్రపాణే
భోగీంద్రభోగమణిరంజిత
పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య
భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి
కరావలంబమ్ ||

కీర్తనమ్ — 1

రాగః : కేదార

తాలః : ఆది

పాహి శ్రీ నృసింహ పాలిసో |
విహగేంద్ర వాహన |
పాహి శ్రీ నృసింహ పాలిసొ ||

లీల జాల విశాల కలిమల |
శూల ఖలు గోపాల శ్రీలోల |
యదుబాల వనమాల |
శిశుపాల కాలనె | పాహిశ్రీ ||

వేదనాద వినోద బోధ |
యశోద ముద మధురాధికాధిప |
యాదవ భూధవ |
శ్రీధవ మాధవ | పాహిశ్రీ ||

సింధు మందిరవింద బంధుర నంద |
కంద ముకుంద గోవింద |
ఇందిరె బంధ సనందాది వంద్యనె |
పాహి శ్రీ ||

వాసుకీశయ దోషనాశ |
దినేశ శశి సంకాశ లక్ష్మీశ |
వాసవ పోష దశావేశభూషనె |
పాహి శ్రీ ||

శ్రీ మనోమయ సోమ కోమల నామ |
శ్యామల లలామ నిస్సీమ |
కామిత ధామ సంగ్రమాది భీమనె |
పాహి శ్రీ ||

మంగలాంగ భుజంగ భంగ విహంగ
తుంగ తురంగ నీలాంగ |
రంగా అనంగ సుసంగా కృపాంగనె |
పాహి శ్రీ ||

క్షీర వారి విహార సార విచార
ధుర కంఠీరవ వీర
హార కేయూర శృంగారాలంకారనే |
పాహిశ్రీ ||

నామావలిః

జయ నరసింహ శ్రీ నరసింహ
లక్ష్మీనరసింహ
జయ నరసింహ శ్రీ నరసింహ
ప్రహ్లాద నరసింహ

ఘోషః

లక్ష్మీనరసింహ భగవాన కీ జై | ప్రహ్లాదవరదనిగె జై