జానకీ కాంత స్మరణం జయ జయ రామ రామ
కల్యాణానాం నిధానం కలిమలమథనం
పావనం పావనానాం
పాథేయం యన్ముముక్షోః సపది పరపదప్రాప్తయే ప్రస్థితస్య ।
విశ్రామస్థానమేకం కవివరవచసాం
జీవనం సజ్జనానాం
బీజం ధర్మద్రుమస్య ప్రభవతు భవతాం
భూతయే రామనామ ॥
రాగః : మధ్యమావతి
తాలః : ఆది
నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకి వరుని
దేవాది దేవుని దివ్యసుందరుని
శ్రీవాసుదేవుని సీతారాఘవుని
సుజ్ఞాననిధిని సోమ-సూర్యలోచనుని
అజ్ఞానతమమును అణచు భాస్కరుని
నిర్మలాకారుని నిఖిలాఘహరుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని
బోధతో పలుమారు పూజించి నే
నా రాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని
రాఘవం కరుణాకరం
భయనాశనం దురితాపహం
మాధవం మధుసూదనం
పురుషోత్తమం పరమేశ్వరం
పాలకం భవతారకం జయ
భావుకం రిపుమారకం
త్వాం భజే జగదీశ్వరం
నరరూపిణం రఘునందనం
చిద్ఘనం చిరజీవినం
వనమాలినం వరదాభయం
శాంతిదం శివదం పదం
శరధారిణం జయశాలినం
జానకీ కాంత స్మరణం జయ జయ రామ రామ