గురుదేవతా భజనమంజరీ

భజ రే లోకగురుం

ఘోషః

జగద్గురు శంకరాచార్య గురు మహారాజ కీ జై |

శ్లోకః

శ్రీ శంకరేతి సతతం పరికీర్తయంతి
పాదాంబుజం పరగురోర్హృది చింతయంతి |
యే వై త ఏవ సుఖినః పురుషా హి లోకే
శ్రీ శంకరార్య మమ దేహి పదావలంబమ్ ||

కీర్తనమ్ — 1

రాగః : ఆభేరీ

తాలః : ఆది

భజ రే లోకగురుం మనుజ
భజ రే లోకగురుమ్ ||

ఆర్యాంబాముఖపంకజభానుం
ఆర్యాజానిపదాంబుజభృంగమ్ ||

నిత్యానిత్యవివేచనచతురం
సత్యాద్వయచిచ్చింతననిరతమ్ ||

దండకమండలుమండితపాణిం
పండితపామరవందితపాదమ్ ||

శంకరమాశ్రితజనమందారం
కింకరభారతీతీర్థసుసేవ్యమ్ ||

నామావలిః

జగద్గురో శ్రీశంకర
ముక్తిప్రదాయక శంకర
విరాగి పూజిత శంకర
విభూతిభూషిత శంకర
భాష్యకార శ్రీశంకర
భద్రప్రదాయక శంకర
సద్గురుమూర్తే శంకర
సంకటవారక శంకర
శివావతార శంకర
శిష్యహితంకర శంకర

ఘోషః

జగద్గురు శంకరాచార్య గురు మహారాజ కీ జై |