మహాలక్ష్మీ మాతా కీ జై
నమస్తేస్తు మహామాయే
శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే
మహాలక్ష్మి నమోస్తు తే ||
రాగః : మాయామాళవగౌళ
తాలః : ఆది
లక్ష్మి రావే మా ఇంటికి
వరలక్ష్మి రావే మా ఇంటికి
క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మి
రావే మా ఇంటికి
లక్ష్మి రావే మా ఇంటికి
రాజితముగ నెలకొన్న
సూక్ష్మముగ మోక్షమిచ్చు
సుందరి బృందావన ధారి
కుంకుమ పచ్చ కస్తూరి
కోరికతోను గోరోజనము
జాజి పువ్వు జలజలోచిని
ముదముతోన అర్పింతూము
చల్లని గంధము చందనముతో
సామ్రాణి ధూపము
మాతా నీకు ప్రీతిగ ప్రఖ్యాతీగ
సమర్పింతునమ్మ
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం
పంచ బిల్వములు పూర్ణ కలశము
మాతా నీకు ప్రీతిగ
ప్రఖ్యాతీగ సమర్పింతునమ్మ
గుండు మల్లె మొగలి పూలు
దండిగ చామంతి పూలు
మేలైన పారిజాతము
మాతా నీకు ప్రీతిగ
ప్రఖ్యాతీగ సమర్పింతునమ్మ
అందముగ జరి అంచు చీర
కుందనము పచ్చని రవిక
మొగలి పువ్వుల జడనే అల్లి
జడగుచ్చులను కట్టేనమ్మ
మాతా నీకు ముదముతో
మేము చేతుమమ్మ చక్కని పూజ
అందముగ అడవి పండ్లు
కదలి పండ్లు రేగు పండ్లు
మేలైన దానిమ్మ పండ్లు
ఘనముగా కర్జుర పండ్లు
పండు వెన్నెలతో నీకు
పద్మాసిని నే పూజింప
మహాలక్ష్మి మాం పాహి
దీనదయాలో మాం పాహి
క్షీరాబ్ధితనయే మాం పాహి
సర్వమంగలే మాం పాహి
మహాలక్ష్మీ మాతా కీ జై